స్టార్ సెలబ్రిటీలు ప్రతిరోజు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటారు. అయితే స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందడానికి ఒక్కొక్కరు ఒక పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. కొందరు పాటలు వింటే.. మరికొందరు స్విమ్మింగ్, వ్యాయామం చేస్తూ శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పొందుతారు. కొందరు వీడియో గేమ్స్ ఆడుతూ తమ రోజువారీ ఒత్తిళ్లను మరిచిపోతారు. ఇంకొందరు తమ కుటుంబంతో సరదాగా గడుపుతారు. లేడీ సెలబ్రిటీలు మాత్రం ఎక్కువగా యానిమల్ థెరపీని ఆశ్రయిస్తుంటారు. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, సమంత, తమన్నా, త్రిష, మంచు లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా సెలబ్రిటీలు శునకాలతో సరదాగా గడుపుతూ తమ బాధలను మర్చిపోతున్నారు. వీరి జాబితాలోకి తాజాగా రష్మిక మందాన కూడా చేరిపోయారు.



జూన్ 5వతేదీన రష్మిక తన పెట్‌డాగ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చాలా చూడముచ్చటగా ఉన్న ఈ కుక్క పిల్ల పేరు "ఆరా" అని రష్మిక వెల్లడించారు. ఆరా అంటే తెలుగులో వర్చస్సు లేదా తేజస్సు అని అర్థం. అయితే ఇటువంటి మంచి పదాన్ని తన పెట్‌డాగ్ కి పేరుగా పెట్టారు రష్మిక. ఆమె తన పెట్ డాగ్ ని ఒక జంతువులా కాకుండా సొంత బిడ్డ లాగా చూసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా తనతోపాటే తీసుకెళ్తున్నారు. ఇటీవల ముంబైకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ తనతోపాటు తన ఆరా ని కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే ఆమె ఛార్మి కౌర్ ని కలిశారు. విశేషమేమిటంటే.. ఛార్మి కౌర్ కూడా ఒక కుక్క పిల్లని పెంచుతున్నారు. దీంతో వీరిద్దరితో పాటు వీరి కుక్కలు కూడా ఒకేసారి కలిసాయి.



ఐతే ఛార్మి, రష్మిక తమ పెట్‌డాగ్స్‌ ని ఎత్తుకొని వాటి మధ్య పరిచయం పెంచేందుకు ప్రయత్నించారు. ఒక దాని మొహం మరొక దాని ఎదుట పెట్టగా.. ఆ శునకాలు తెగ భయపడిపోయాయి. కొంత సమయం తర్వాత ఈ రెండు శునకాలు కాస్త కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్లు.. రష్మిక పెట్ డాగ్ ఛార్మి శునకాన్ని ముద్దాడినట్లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో కనిపించింది. ఛార్మి.. ఆరా ని మచ్చిక చేసుకుని దాన్ని తన భుజాలమీద ఎత్తుకున్నట్లు కూడా ఓ ఫోటోలో కనిపించింది. తమ పెట్‌డాగ్స్‌తో చార్మి, రష్మిక చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు చాలా క్యూట్ గా ఉండటంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: