తెలుగు చిత్ర పరిశ్రమకు సుడిగాడు సినిమాతో పరిచయమైంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్ నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సుడిగాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఆఫర్స్ వచ్చిన కూడా వద్దనుకొని కొంత కాలం టాలీవుడ్ కి దూరమైంది.

ఇక అదే సమయంలో మోనాల్ గజ్జర్ మాతృభాషలో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ భామ. ఇక బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షోకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో విజయవంతగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4లోకి మోనాల్ గజ్జర్ ఊహించని విధంగా పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

అయితే హౌస్ లో కో పార్టిసిపెంట్ అఖిల్ సార్ధక్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో మరోసారి ఈ బ్యూటీ తెలుగునాట పాపులర్ అయ్యింది ఈ భామ. అంతేకాదు.. హౌస్ నుంచి బయటకి రాగానే బెల్లంకొండ అల్లుడు అదుర్స్ మూవీలో ఐటెం సాంగ్ లో సందడి చేసింది ఈ భామ. ఆ తరువాత ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించిన  డాన్స్+ షోలో జడ్జ్ గా బుల్లితెరపై సందడి చేసింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బుల్లితెరపై మరోసారి మోనాల్ సందడి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక  ఈ సారి ఆమె ఏకంగా యాంకర్ గా కనిపించాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే స్టార్ మా ఛానల్ కొత్తగా ఓ కామెడీ రియాలిటీ షో స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. అలాగే ఈ షోకి యాంకర్ గా మోనాల్ గజ్జర్ ని ఫైనల్ చేసినట్లు తెలిపారు. అయితే తెలుగులో పెద్దగా రాని రష్మి యాంకర్ గా సక్సెస్ అయినపుడు మోనాల్ కూడా తన వచ్చిరాని తెలుగు భాషతో, తన హాట్ షోతో సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే షోకి మంచి రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని స్టార్ మా భావించి ఆమెని ఎంపిక చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: