సోనూసూద్ తెలుగులో విలన్ గా నటించి అందరిని మెప్పించారు. ఈయన సినిమాలలోనే విలన్. కానీ నిజ జీవితంలో ఎంతో మంచి హృదయం గల వ్యక్తి.. అనడానికి గల కారణమేమిటంటే..ప్రస్తుతం అందరికీ తెలుసు..ఈయన ఎన్ని సేవలు చేస్తున్నారో ప్రజల కోసం. తన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి కూడా ప్రజల సేవ చేస్తున్నాడంటే ఎంత దయా హృదయం కలవారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన వాళ్ళ తండ్రి గుర్తుగా తన వద్ద  ఉంచుకున్న ఒక వస్తువు యొక్క ఫోటో వైరల్ గా మారింది.



1973 జులై 30న శక్తి సాగర్ సూద్, సరోజ సూద్ దంపతులకు జన్మించిన కుమారుడు సోనూ సూద్. సోనూసూద్ వాళ్ళ నాన్నగారు ఒక ఎంటర్ప్రీన్యూర్, తల్లి ఒక టీచర్. సోనూసూద్ కి మొత్తం ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సోనూసూద్ గారు పదో తరగతి చదువుతున్న వయసులోనే తన స్నేహితులతో కలసి చిన్న చిన్న మంచి పనులు కూడా చేసేవారు.

తను ఇంజనీరింగ్ చదువుకొని,పూర్తి అయిన వెంటనే..5500 రూపాయలు తీసుకొని ముంబైకి వచ్చారు సోనూసూద్. తనని సినిమాలో నటించడానికి అవకాశం ఇవ్వండి అంటూ అన్నిచోట్లా తిరిగారు.అయినా కూడా అవకాశం రాకపోవడంతో తను ఉంటున్న రూమ్ రెంట్ కూడా కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. అప్పుడు ఒక ప్రైవేటు కంపెనీలో ఫీల్డ్ వర్కర్ గా పని చేయడానికి చేరాడు. ఆ కంపెనీ వారు ఇచ్చే జీతం కేవలం రూ. 4,500. ఇందులో తన ఖర్చులు పోగా మిగిలిన దానిలో తన రూమ్ లో ఉండే వారు ఎవరూ పస్తులు ఉండకూడదని వారందరి కోసం సరుకులు తెచ్చి ఇచ్చేవారు.


సోనూ సూద్ నటించిన మొట్టమొదటి చిత్రం తమిళ్ లో "జాగర్" లో నటించాడు విలన్ గా. ఇక తెలుగులో హ్యాండ్స్ అప్ అనే  సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ తీసిన అతడు సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. శ్యామ్ రెడ్డి గారు 2006లో పశుపతి పాత్రకి ఆడిషన్స్ జరుపుతుండగా  ఇక ముందుగా అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకి "పశుపతి "ని అనుకున్నారు. కానీ కోడి రామకృష్ణ గారికి ఆయన నచ్చలేదు. కానీ కోడి రామకృష్ణ గారికి అశోక్ సినిమాలో సోనూ చేసిన యాక్టింగ్ కి ఫిదా అయి, ఈయన్ని పశుపతి గా పెడదామని చెప్పారు. అలా  అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు సోనుసూద్. ఇదంతా ఒక ఎత్తయితే ఒక రోజు టీవీ చూస్తూ ఉండగా వలస కూలీలు వేల కిలోమీటర్లు నడుస్తూ వస్తుండడంతో.. ఆ ఆ సీన్ చూసి , చలించిపోయి సోనూ ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే భోజనాలు, వారి సొంత ఊరికి పంపించడం వంటివి చేశాడు.

ఇక ఇంత మంచి కొడుకుని ఇచ్చిన వారి తండ్రి గుర్తుగా తన ఒక  పాత స్కూటర్ ని తన వద్దనే ఉంచుకున్నాడు  ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: