డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కొంత విరామం తీసుకోని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోగా రామ్ మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తరువాత పూరీ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. విజయ్ లైగర్ కంటే ముందు నటించిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. విజయ్ లైగర్ సినిమాతో హిట్ కొట్టాలని విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇక లైగర్ సినిమా సగానికి పైగా షూటింగ్  పూర్తి చేసుకుంది. పూరీ ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజగా ఈ సినిమాను ప్రముఖ ఓటిటి నుండి బంపర్ ఆఫర్ ఇచ్చింది. విజయ్ నటించిన లేగర్ సినిమాకు ఓటిటి నుండి 200 కోట్ల భారీ డీల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓటిటి ఇచ్చిన ఆఫర్ మేకర్స్ ను కన్ ఫ్యూజన్ లో పడేసింది. లేగర్ సినిమాను తెలుగుతో పాటుగా అన్ని సౌత్ భాషలు, హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. ఇక ఈ సినిమాకు ఓటిటి నుండి వచ్చిన ఆఫర్ ఆకర్షించే విధంగా ఉంది.


విజయ్ దేవరకొండ ఓటిటి ఆఫర్ పై స్పందించారు. మీరు ఇచ్చిన ఆఫర్ నాకు చాలా తక్కువ. నేను థియేటర్లలో ఎక్కువగా వసూలు చేస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక విజయ్ ట్వీట్ లోనే తెలిసిపోతుంది ఓటిటి ఆఫర్ ని తిరస్కరించారు. అంతేకాదు.. లైగర్ సినిమా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు తేలిపోయింది. ఇక ఈ సినిమాపై, తెలుగు, హిందీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పూరీ జగన్నాథ్ తో పాటుగా హిందీ వర్షన్ రైట్స్ కరణ్ జోహార్ కొనేశారు. ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: