సినిమా ఇండస్ట్రీ లో ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ వచ్చిన స్టార్డం రేపు ఉండదు. ఇవాళ చేతిలో ఉన్న డబ్బు రేపు ఉండదు. అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఈ రోజు సాయంత్రానికి ఉంటుందో ఉండదో కూడా తెలియదు.  అందుకే స్టార్స్ అందరూ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సపోర్టుగా మరికొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. హీరోయిన్ లు కూడా ఇదే బాటలో నడుస్తూ ఇతర రంగాల్లో పెట్టుబడి పెడుతూ సంపాదనలో దూసుకు వెళ్తుంటారు. అలాంటి స్టార్స్ కి కరోనా వైరస్ రూపం లో  పెద్ద దెబ్బ పడింది.

ఈ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో తో పాటు చిత్ర పరిశ్రమ పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించి పోవడంతో ఆదాయం తగ్గి పోయింది. షూటింగ్ లు లేకపోవడంతో నటీనటులందరూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో సంపాదించినదంతా వ్యాపారాల్లో పెట్టడంతో చాలా మంది స్టార్స్ కరోనా కారణంగా ఇటు సినిమాలు అటు వ్యాపారంలో బాగా నష్టపోయారు. ఆ విధంగా వ్యాపారం, సినిమా లు లేకుండా పోవడంతో వారి మెయింటనెన్స్ కి డబ్బు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు.

దాంతో అప్పటివరకు వారు సంపాదించిన ఆస్తులను అమ్మక తప్పడం లేదు. ఇటీవలే టాలీవుడ్ యువ హీరో ప్రారంభించిన హోటల్ బిజినెస్ సక్సెస్ అయినప్పటికీ గత రెండేళ్లలో బాగా లాస్ వచ్చిందని  ఆ హోటల్ అమ్మక తప్పడం లేదని తెలుస్తోంది. మరొక స్టార్ హీరో భాగస్వామిగా ఉన్న పబ్ బిజినెస్ మరో సీనియర్ హీరో కన్వెన్షన్ బిజినెస్ కూడా నష్టాల్లో నడుస్తున్నాయట. బిగ్ స్టార్స్ పరిస్థితి పర్వాలేదు కానీ వ్యాపారాల లో ఉన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రం భారీగా నష్టపోయారు. అయితే ఇప్పుడు సాధారణ పరిస్థితులు వస్తుండడంతో మళ్ళీ వారి వ్యాపారాలను బాగు పరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలు తమ వద్ద ఉన్న స్థిరాస్తులను అమ్మకానికి పెట్టాలనే నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: