సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఏ విధంగా మారుతుందో ఎవరికీ తెలియదు.  ఒకటి అవుదామని వస్తే మరొకటి అవుతారు. ఏదైతేనేం తాము కోరుకున్న సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటారు కానీ కానీ బయటికి మాత్రం వెళ్లరు. ఆ విధంగా టాలీవుడ్ లో సింగర్ గా ప్రవేశించి ఆ తర్వాత దర్శక నిర్మాతల కళ్ళల్లో పడి హీరోయిన్ లు గా, టాప్ హీరోయిన్ లుగా చాలా మంది గాయనీమణులు ఎదిగారు. ఆ విధంగా పాటలతో పాటు నటనతో సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ముద్దుగుమ్మలను ఇప్పుడు చూద్దాం.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన మమతామోహన్ దాస్ మొదట టాలీవుడ్ కి గాయకురాలిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. ఎన్టీఆర్ నటించిన రాఖీ ఈ చిత్రంలోని రాఖీ రాఖీ అనే పాటను ఆలపించి తన గాత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది మోహన్ దాస్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో తన గాత్రాన్ని వినిపించింది. తెలుగులో యమదొంగ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు మలయాళం లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె చేతిలో ఈ సంవత్సరం దాదాపు డజను సినిమాలు ఉన్నాయి అంటే అక్కడ ఆమెకు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే సింగర్ సునీత కూడా తన పాటలతో ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అయితే పలు సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చినా ఆమె తిరస్కరించింది. గీతా మాధురి తన గాత్రం తో, అందంతో ఆకట్టుకుంది. కానీ సినిమాలలో అవకాశాలు వస్తే మాత్రం నో చెప్పింది. తమిళ నటి ఆండ్రియా కూడా మొదట్లో గాయనిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ సెట్ అయింది.  సింగర్ మడోన్నా సంగీత ప్రపంచం నుంచే వెండి తెరమీదకు అడుగుపెట్టింది. ఈమె ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.  అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ గాయనీ మనులు పాటలతో పాటు యాక్టింగ్  వైపుకు కూడా అడుగు లేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: