సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. "సర్కారు వారి పాట" సినిమాతో వచ్చే సంక్రాంతి పండుగకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్న పరశురామ్ పెట్ల చాలా గ్యాప్ తీసుకుని కేవలం మహేష్ కోసం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి ఇంకా కొందరు వ్యాపారవేత్తలు అక్రమంగా తీసుకుంటున్న రుణాలు ఎగరవేత వంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. గత సంవత్సరం ఆరంభంలోనే ఈ సినిమా ప్రకటన రావడం జరిగింది. కాని కరోనా వైరస్ కారణంగా సినిమా ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో సూపర్ మహేష్ బాబు ఇంకా పరశురామ్ ఉన్నారట.అందుకే ఎక్కువ కాలం ఆ సినిమా తోనే సమయాన్ని వృదా చేయకూడదనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ తో సినిమాను ప్రకటించాడు మహేష్.

ఇక నిర్మాతలు మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.త్రివిక్రమ్ గత సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాడు.కాబట్టి వెంటనే సూపర్ స్టార్ తో సినిమా మొదలు పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే  సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట.అందుకే పరశురామ్ ని మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చెయ్యాలని తొందర చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక పరశురామ్ కూడా ఈ సినిమాని తనదైన స్టైల్ లో తెరకెక్కించి తొందరగా షూటింగ్ పూర్తి చేసి మహేష్ కి మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. స్వతహగా పరశురామ్ మహేష్ అభిమాని కావడంతో మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యస్ యస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: