
అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆగిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రామ్ పోతినేని కూడా తమ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇదే క్రమంలోనే లింగుస్వామి కూడా యాక్షన్ సీన్లు చేసేందుకు అన్ని ప్లాన్ చేసుకుని పని మొదలుపెట్టనున్నారు.
అయితే ఈ నెల జులై 12 నుంచే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంటిన్యూగా మొదలుపెట్టనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేసింది. రామ్ పోతినేని మార్కెట్ ఇప్పుడు భారీగా పెరగడంతో ఆయన క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కూడా తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లోనే భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి.
ఇక లింగుస్వామి మొదటి నుంచి స్టైలిష్ అండ్ మాస్ మూవీలను తెరకెక్కించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో హీరోలను అత్యంత మాడ్రన్ లుక్‌లో కనిపించేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక రామ్ నుండి కూడా అభిమానులు అలాంటి స్టైలిష్ లుక్‌లను ఇష్టపడుతున్నారనేది తెలిసిందే. ఈ కారణాలతో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మరి వీరి కాంబినేషన్ ఎలాంట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా రామ్ కూడా ఇప్పుడు ఇలాంటి ప్యాన్ ఇండియన్ మూవీ చేయడంతో ఆయన అభిమానులు తెగ సంబురాలు చేసుకుంటున్నారు.