
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన బాడీకి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమాలు చేయట్లేదు అని ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. తనకు సూట్ కాని కథలను ఎంచుకుని సినిమాలుగా చేసి బొక్క బోర్లా పడడం హృతిక్రోషన్ కు అలవాటయిపోయింది. ఎప్పుడో గానీ ధూమ్, క్రిష్ వంటి సినిమాలు పడుతున్నాయి. హృతిక్ రోషన్ ఫిజిక్ కు, అతడి యాక్షన్ కు, ఇమేజ్ కు తగ్గ సినిమా ఇప్పటిదాకా పడలేదని అంటారు ఆయన ఫ్యాన్స్. వార్ లాంటి యాక్షన్ మూవీస్ లో నటించిన హృతిక్ రోషన్ రేంజ్ కి అది సరిపోలేదు అన్నది వారి అభిప్రాయం.
అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైటర్ సినిమా ఇన్నాళ్లకు హృతిక్ రోషన్ కు పడిన సరైన సినిమా అని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ జనాలు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని హృతిక్ రోషన్ ప్రకటించగా ఆ తర్వాత ఈ సినిమాపై చాలానే పుకార్లు చెలరేగుతున్నాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుందట.
దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో అంతకుమించి యాక్షన్ సీన్లు, అడ్వెంచర్స్ సీన్లు ఉండబోతున్నాయట. ఇంటర్నేషనల్ స్థాయి లో ఈ సినిమా యాక్షన్ సీన్లు ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాలో యుద్ధ విమానాలు, గాలి లో యాక్షన్ సీక్వెన్స్ లు భారీగా ఉంటాయని ప్రకటించాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి భారీ యాక్షన్ సినిమా ఇంతవరకు రాలేదని చెప్పాడు. గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ కి తగ్గట్లు పాత్ర ఉంటుంది అని అంటున్నాడు. మరి ఎన్నాళ్లనుంచో హాలీవుడ్ స్థాయిలో హృతిక్ యాక్షన్ చూడాలనుకుంటున్న ఆయన ఫ్యాన్స్ కు ఈ సినిమా ఏ విధంగా ట్రీట్ ఇస్తుందో చూడాలి.