
ఇండస్ట్రీలో కరోనా టైంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. హీరోలు హీరోయిన్ లు అనే తేడా లేకుండా చాలా మంది తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఆ విధంగా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు ఎప్పుడు పిల్లల్ని కంటారు అని వారి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . మరి పిల్లలని ఎప్పుడు కంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్న ఆ స్టార్ కపుల్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంటకు పెళ్లి అయ్యి దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది. అయితే వారు ఇంకా పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకోలేదు అని చెబుతున్నారు. వీరిని పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఎవరు ఎప్పుడు అడిగినా కూడా ఇంకా టైం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. రామ్ చరణ్ కూడా దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఏమో కానీ మెగా వారసుడి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక టాలీవుడ్ లో మరో క్రేజీ జంట అయిన అక్కినేని నాగచైతన్య సమంత వారసుడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. 2017 లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టగా వారు ఎంతో సంతోషంగా ఉన్నట్లు చాలాసార్లు తెలిపారు. కానీ వీరికి పిల్లలు మాత్రం పుట్టకపోవడం తో అక్కినేని అభిమానులు ఒక విధంగా నిరుత్సాహంతో ఉన్నారు. వరుణ్ సందేశ్ వితిక ల జంట కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. వీరు కూడా 2015లో ప్రేమించి పెళ్లి చేసుకో గా పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హాట్ బ్యూటీ నమిత 2017 లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఇంకా పిల్లల గురించి ఎందుకులే అనే ధోరణి ఉన్నట్లు సమాచారం.