టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా తన కొత్త సినిమా నారప్ప అమెజాన్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమానీ తెలుగులో రీమేక్ చేయగా ఈ సినిమా తెలుగులో బాగా ఆడుతుందా లేదా అన్న కొంతమంది ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెబుతుంది నారప్ప సినిమా. ప్రియమణి వెంకటేష్ కి జోడీగా నటించగా రాజీవ్ కనకాల కార్తీక్ రత్నం కీలకపాత్రలలో కనిపించారు. వీరు సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణమయ్యారు. ప్రస్తుతం విడుదలైన సినిమాలు ఏవి లేకపోవడంతో నారప్ప సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు పడుతున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా తరువాత దృశ్యం సీక్వెల్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమా థియేటర్ లలోనా ఓటీటీ లోనా అనేది త్వరలో తెలియనుంది. వీటితో పాటే అనిల్ రావిపూడి దర్శకత్వం లోను f3 సినిమా చేస్తున్నాడు వెంకటేష్. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాకోసం ప్రేక్షకులు మరోసారి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే మన హీరోలు టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్పులు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఎవరు ఈ రకమైన ధైర్యాన్ని చేయలేక పోతున్నారు. రీసెంట్ గా వెంకీ నెల రోజుల పాటు యూరప్ ట్రిప్ వేయాలని భావిస్తున్నారట. దీనికోసం f3 సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టుకున్నారట. అయితే వెంకటేశ్ నిర్ణయంపై దిల్ రాజు కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ప్లాన్ చేసుకున్న షూటింగ్ క్యాన్సిల్ చేయడం అంటే పెద్ద లాస్ వస్తుంది అని దిల్ రాజు వెంకీ కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో వెంకటేష్ తమ నిర్ణయం మార్చు కుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: