టాలీవుడ్ లో స్టార్ హీరో ల మధ్య పోటీ ఉండడం సహజం. వీరు నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవుతూ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. టాలీవుడ్ లో ఉన్న ఏ ఇద్దరు హీరోల మధ్య పోటీ నెలకొన్నవచ్చు. అప్పుడు ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా హిట్ కొట్టి ఒకరిపై ఒకరు విజయం సాధిస్తారు. ఆ విధంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో చాలా మందికి ఇలాంటి పోటీ ఎదురయ్యింది. సింగిల్ గా వద్దామనుకున్న ప్రతిసారీ వారికి వేరే హీరో దగ్గర నుంచి పోటీ తప్పకుండా ఉంటుంది.

ఆ విధంగా టాలీవుడ్ లో ఎంతో ఆసక్తి కరమైన పోటీతత్వం ఉన్న హీరోలు అంటే అల్లు అర్జున్ మహేష్ బాబు అని చెప్పవచ్చు.  గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వీరిద్దరూ ఆహ్లాదకరమైన పోటీని కనబరుస్తూ తమ సినిమాలను రెండు రోజుల వ్యవధిలోనే విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరూ నీకేవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. 

కానీ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా అర మార్క్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా పై పైచేయి సాధించింది. కాగా మరొకసారి కూడా ఇద్దరు హీరోలు పోటీపడక తప్పట్లేదు అనిపిస్తుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కూడా పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యేసరికి సంక్రాంతి వస్తుందట. ఆ టైం లోనే ఈ ఇద్దరూ హీరోలు విడుదల చేయాలని చూస్తున్నారట. దాంతో మరోసారి వీరిద్దరికీ బాక్సాఫీస్ వద్ద సమరం తప్పదు అనిపిస్తుంది. ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: