టాలీవుడ్ లో హీరో జగపతి బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జగపతి బాబు అప్పటి స్టార్ హీరో అయినా చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణల కు గట్టి పోటీ ఇచ్చాడు. తనకే సొంతమైన అద్వితీయమైన నటనతో జగపతిబాబు కుటుంబ కథా చిత్రాలు చేసి కుటుంబ కథల హీరోగా ఎదిగాడు. అయితే క్రమక్రమంగా ఆయన ట్రెండ్కు తగ్గట్టు సినిమాలు చేస్తూ వచ్చాడు.  దశాబ్దకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా, విలన్ పాత్రల్లో చేసుకుంటూ వచ్చి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు.

నిజానికి చెప్పాలంటే ఆయన హీరోగా చేసినప్పటికంటే విలన్లుగా చేసినప్పుడే ఎక్కువ పాపులారిటీని అదుకున్నాడు. అంతకుముందు కొన్ని సినిమాలకు హీరోగా చేసినా కూడా మినిమం హీరో గా కూడా నిలబడలేక, హిట్ సంపాదించలేక ఆల్మోస్ట్ తన కెరియర్ కు ఎండింగ్ పలికే పరిస్థితి ఉంది. కానీ జగపతిబాబు బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారి తన రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. తమ సినిమాలో జగపతిబాబు విలన్ గా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలను దర్శకులకు తెప్పించాడు.

విలనిజాన్ని తన కళ్ళలో నే పలికించి హీరోలను సైతం డామినేట్ చేసి నటుడిగా ఎదిగాడు జగపతిబాబు. అయితే తాను విలన్ గా మారక ముందు జగపతి బాబు హీరోగా సినిమాలు తగ్గిపోవడంతో ఎంతో కుంగిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ టైంలోనే డబ్బులు కూడా కోల్పోయాడు. జగపతి బాబు తండ్రి నిర్మాత కావడంతో సొంత బ్యానర్ పై నిర్మించిన చిత్రాల్లో నటించడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన జగపతిబాబు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తను నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో సొంత బ్యానర్లో సినిమాలు చేసి అవి కూడా ఫ్లాప్ కావడంతో వాటి ద్వారా ఎంతో నష్టపోయాడు. అలా బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిత్రాలలో ఆయన ఆకట్టుకోలేకపోయాడు. అడిగిన వారికి అడిగినట్లు డబ్బు సహాయం చేయడంతో జగతిబాబు ఆస్తి మొత్తం అవిరైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: