ఇక చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా మల్టీస్టారర్ మూవీ కావడం గమనార్హం అనే చెప్పాలి. కాగా.. శంకర్ మూవీలో స్పెషల్ రోల్ లో కమల్ హాసన్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినపడుతుంది. అంతేకాదు.. శంకర్ కమల్ హాసన్ సన్నిహితులనే అందరికి తెల్సిన విదితమే. ఇక శంకర్ అడిగితే కమల్ హాసన్ నో చెప్పే అవకాశాలు అయితే ఉండవు అని తెలుస్తోంది.
అయితే కమల్ హాసన్ ఈ పాత్రకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. కానీ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్, కమల్ స్క్రీన్ షేర్ చేసుకుంటే కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులు బద్దలవడం గ్యారంటీ అని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక మరోవైపు శంకర్ కమల్ కాంబోలో కొంతకాలం షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు2 షూటింగ్ మళ్లీ మొదలవుతుందో లేక పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందో అని విషయం తెలియలేదు.
కాగా.. రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంటుంది. అయితే శంకర్ సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అంతేకాక.. శంకర్ చరణ్ కాంబో మూవీ 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి