ఇటీవలే డ్రగ్స్ ఆరోపణలతో సంచలనం సృష్టించిన సంజన గల్రాని నిత్యం వార్తల్లో నిలుస్తు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికి పోవడంతో,  ఆపై చీటింగ్ ఆరోపణలు రావడం, వీటన్నిటి మధ్య ఆమె సడన్ గా సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయ్యింది. మొత్తంగా సంజన తన జీవితం గత రెండేళ్లలో ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో ట్విస్ట్ లను అందరికీ పంచింది. తెలుగులో పలు సినిమాల్లో చేసిన సంజన ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకుంది.

అజీజ్ పాషా అనే వ్యక్తి తో పెళ్లి చేసుకున్న సంజన ఆ తర్వాత మీడియా కి పూర్తిగా దూరంగా ఉంది. కానీ పుకార్లు రావడం ఆమెను వదలడం లేదు. పెళ్లై ఏడాది కూడా కాలేదు అప్పుడే ఆమె తన భర్తతో అభిప్రాయ భేదాలు వచ్చి వీడి పోతున్నదని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఆమె మాత్రం ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పడం ఇప్పుడు కొంత ట్రెండ్ అవుతుంది.

ఆయన చాలా మంచివారు అని, వృత్తిరీత్యా డాక్టర్ అనీ,  బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడని చెబుతూ తన భర్త గురించి గొప్పలు చెప్పింది. పైగా ఆయన తన బాల్యమిత్రుడు, చిన్నప్పుడు ఏర్పడిన స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందని, ఈ ప్రపంచంలో తను తాను మాత్రమే తనను బాగా అర్థం చేసుకుంటాడని ఓ రేంజ్ లో మొగుడు గురించి గొప్పలు చెప్పింది. మరి ఈ విడాకుల సంగతి ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆమె దీనిపై స్పష్టత ఇస్తే క్లారిటీ రాదు. దాదాపు ఈమె సినిమాలకు పూర్తిగా దూరం అయినట్లే అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: