స్నేహం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్నేహితుడు ఉంటే ఆ మనిషికి బాధలు అనేవి ఉండవు అనేది పెద్దలు చెప్పిన మాట. స్నేహం గురించి స్నేహితుల గురించి ఎన్నో సినిమాలు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో రాగా వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది స్నేహితులు అయ్యారు. స్నేహితులుగా మారడమే కాకుండా ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా  ఆరాదించుకున్నారు. అలా టాలీవుడ్ లో స్నేహం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ సినిమాగా మనకు మొదట కనిపించే సినిమా హ్యాపీ డేస్.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ నిఖిల్ రాహుల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సృష్టించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా అప్పటి యువతరాన్ని ఎంత మెప్పించింది అప్పటి రికార్డులు ఇప్పటికీ మనకు గుర్తు చేస్తున్నాయి. స్నేహానికి యెంత విలువ ఇస్తూ స్నేహ బంధం అంటే ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని సరికొత్త కోణంలో చూపించిన సినిమా ఇది. ప్రాణమిచ్చే స్నేహితులని సైతం చూసిన మనం స్నేహం ను ఉపయోగించుకొని ఇలా కూడా చేస్తారా అనే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. 

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మార్మోగి పోతూనే ఉంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం వహించిన ఈ పాటలు సూపర్ హిట్ కాగా 2007లో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న తారాగణంతో నిర్మించబడిన ఈ సినిమా లో నటించిన నటీనటులు  ఇప్పుడు స్టార్ లుగా ఎదిగారు. ఈ సినిమాలో నటించిన నిఖిల్ ఇప్పుడు మంచి సినిమాలు చేసుకుంటూ పోతూ ఉండగా తమన్నా స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది. బాలీవుడ్లో సైతం ఆమె సినిమాలు చేస్తుంది. వీరు ఇప్పటికీ స్నేహంగా మెలుగుతూ జీవితంలో కూడా మంచి స్నేహితులనీ నిరూపించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: