
ప్రస్తుతం బాలీవుడ్ లో మన టాలీవుడ్ హీరోలు పాగా వేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీ మార్కెట్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది అక్కడ సినిమా లలో నటించి క్రేజ్ తెచ్చుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో ఇప్పటికే పాతుకుపోగా సాహో తో దాన్ని కొనసాగిస్తున్నాడు. అక్కడ మరిన్ని సినిమాలు చేసి సెటిల్ అయ్యేలా ఉన్నాడు ప్రభాస్. అయితే రెబల్ స్టార్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వారికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కలేదు.అలా అక్కడ సక్సెస్ దక్కని హీరోలు ఎవరూ ఇప్పుడు మనం చూద్దాం.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ హిందీలో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత ఆయన హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఏఎన్ఆర్ హిందీలో సినిమాలు చేసినా ఎక్కువగా రాణించలేకపోయారు. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా ద్వారా నాగార్జున కూడా బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అంతే కాదు అమితాబ్ బచ్చన్ తో కలిసి ఓ సినిమాలో కూడా నటించాడు కానీ హిట్ కాలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం 3 హిందీ సినిమాలు చేసినా అవి సరైన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కి ఫుల్ స్టాప్ చేశాడు. వెంకటేష్ కూడా బాలీవుడ్ ప్రయత్నాలు చేసి మానేయక తప్పలేదు.
టాలీవుడ్ హీరో జె.డి.చక్రవర్తి సైతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా అవి వర్క్ ఔట్ అవక తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత రవితేజ కూడా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వగా పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. రానా గతంలో కొన్ని సినిమాలలో నటించగా ప్రస్తుతం కొన్ని సినిమాలతో అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా జంజీర్ బాలీవుడ్ లో చేయగా ఆ సినిమా విజయం సాధించలేదు.