బాలీవుడ్ టు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. నిన్న జరిగిన ఆ వేడుకకు సంబంధించిన పిక్స్ నేడు వైరల్ అవుతున్నాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా శంకర్ సినిమా "ఆర్సీ 15"లో రామ్ చరణ్‌తో కియారా జతకడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ "షేర్‌షా" కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ బ్యూటీ తన కుటుంబం, సలను పిక్స్ లో చూడొచ్చు. ఆమె సోదరి ఇషితా అద్వానీ కూడా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. కియారా తెల్లని ప్యాంటుతో ప్రకాశవంతమైన పసుపు పట్టు కామిసోల్ ధరించి ఉంది. ఆమె షేర్ చేసిన ఫోటోలలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా కన్పించాడు. అతను కూడా ఆమె కుటుంబంతో కలిసి కియారా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

 

అంతకుముందు సిద్ధార్థ్ మల్హోత్రా ఆమెతో పని చేయడం అద్భుతమైన అనుభవం అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "షేర్షా"లో షూటింగ్ సమయంలో తనతో కలిసి చాలా జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వేడుకకు వెళ్తూ కారులో సిద్ధార్థ్ రొమాంటిక్ సాంగ్ కు సంబంధించిన పాటకు రొమాంటిక్ మూడ్‌లో కన్పిస్తూ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇదంతా చూస్తుంటే వీరి ప్రేమ వ్యవహారం రూమర్స్ కే పరిమితం అయ్యేలా కన్పించడం లేదు. త్వరలోనే వీరిద్దరి రిలేషన్ పై అధికారికముగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వారు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లారు. ఇక ఈ బ్యూటీకి కత్రినా కైఫ్, దిశా పటానీ, జాన్వీ కపూర్, భూమి పె డ్నేకర్, దియా మీర్జా, సమంత రూత్ ప్రభు, షాహిద్ కపూర్, సారా అలీ ఖాన్, మనీష్ మల్హోత్రా, డబ్బూ రత్నానీ, తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కియారా అద్వానీ ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న యువ నటీమణులలో ఒకరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: