టాలీవుడ్ సినీ హీరోలకు సినిమాలు మాత్రమే కాదు బయట కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి. హీరోగా మాత్రమే కాకుండా ఇతర బిజినెస్ లలో ఎదిగి మంచి వ్యాపారవేత్తగా కూడా ఎదగాలని వారు ఆశపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. థియేటర్ బిజినెస్ లోకి, హోటల్స్ బిజినెస్ లోకి, పబ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతూ తమ ఇంట్రెస్టు ను చూపిస్తున్నారు.

ఆ విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సహా చాలా మంది నటీనటులు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతుండడం ఇప్పుడు అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. షూటింగ్ లలో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయంలో ఫామ్ హౌజ్ కి వెళ్లి అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఖాళీ సమయంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉండడం ఇప్పుడు ఆయన అభిమానులు ఎంతో కృషి చేస్తోంది. గతంలో సైతం అయన వ్యవసాయం పై పలుమార్లు తన ఇష్టాన్ని చూపించాడు.. రైతులకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు ఎన్టిఆర్.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులలో ఉన్న ఎన్టీఆర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొరటాల శివ తో సినిమా అని మొదలు పెట్టాలి అని చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తన ఖాళీ సమయంలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఆరున్నర ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం చేయాలని చూస్తున్నారట. ఇటీవలే ఆ ప్రాంతపు రిజిస్ట్రేషన్ కార్యాలయం లో  భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: