ప్రస్థుతం ఇండస్ట్రీని శాసిస్తున్న టాప్ హీరోలకు 20 కోట్ల నుండి 50 కోట్ల మధ్య భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. కరోనా పరిస్థితులు వల్ల ఇండస్ట్రీలో అయోమయ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ టాప్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికాలలో కనీసం 10 శాతం కూడ తగ్గించడం లేదు.


చిన్న హీరోల సినిమాలకు ప్రేక్షకులు ధియేటర్లకు రాని పరిస్థితులు ఏర్పడటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలకు సినిమాలు తీయాలి అంటే పెద్ద హీరోలు లేదంటే మీడియం రేంజ్ హీరోలు మాత్రమే దిక్కు అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు అంటే 100 కోట్ల పెట్టుబడి మీడియం రేంజ్ హీరోల సినిమాలు అంటే 40 కోట్ల పెట్టుబడి కొనసాగుతున్న పరిస్థితులలో కనీసం సినిమా పై పెట్టిన పెట్టుబడి నిర్మాతలకు తిరిగి రావాలి అంటే కనీసం నాలుగు వారాలు ధియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడవలసిన పరిస్థితి.


అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు ఎప్పటికి మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో విప్లవ సినిమాల నాయకుడు నారాయణ మూర్తి ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితులను చక్కదిద్దడానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావాలి అంటూ చేసిన కామెంట్ కు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ఎలాంటి సపోర్ట్ లభించకపోవడం ఆశ్చర్యంగా మారింది. దీనికి కొనసాగింపుగా హీరో నాని ‘తిమ్మరుసు’ మూవీ ఫంక్షన్ లో మాట్లాడుతూ ధియేటర్ల టిక్కెట్ల రెట్లు 50 శాతం ఆక్యుపెన్సీ ధియేటర్లకు సంబంధించిన ఇతర సమస్యల పై చేసిన కామెంట్స్ కు కూడ ఇండస్ట్రీ ప్రముఖుల నుండి మద్దతు లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  


ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇండస్ట్రీ పెద్ద హోదాలో చిరంజీవి కొనసాగుతున్నాడు. చిరంజీవి మాత్రమే కాకుండా ఇండస్ట్రీని శాసిస్తున్న అనేకమంది ప్రముఖులు ఉన్నారు. దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి వీరిలో ఎవరు ఎందుకు ముందుకు రావడంలేదు అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోలు తమ పారితోషికాల గురించి తప్ప ఇండస్ట్రీ పరిస్థితుల గురించి పట్టించుకోరా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: