
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేలంగి, ఆలీ షో కి రాగా, ఆ షోకి ఆలీ , రేలంగికి గణ స్వాగతం పలికారు. అలా ఎంట్రీ ఇచ్చిన రేలంగి నరసింహారావును..తన ఇంటి పేరుతో పిలిచారు ఆలీ.. నటుడు రేలంగి వెంకటరామయ్య కు, మీకు గల ఉన్న బంధం ఎటువంటిది అని అడిగాడు. అందుకు సమాధానంగా రేలంగి నరసింహారావు.. అలా వెంకటరామయ్య ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, రేలంగి నరసింహారావు ని పిలిచి.. నీ పేరు నుంచి రేలంగిని తొలగించుకో అని చెప్పారట.
అలా ఎందుకు సార్ అని అడగగా.. సెట్ లో మీ గురువు గారు ఎవరిని తిడుతున్నారో అర్థం కావడం లేదు.. అది నిన్నో లేక నన్నో అని చెప్పడం కస్టం అని కమెడియన్ రేలంగి చెప్పడంతో, ఇక అప్పటి నుంచి రేలంగి నరసింహారావు అనే పేరును నరసింహారావు అంటూ పిలవడం జరిగింది..రేలంగి వెంకట రామయ్య. ఇక తను చిన్న వయసులో.. చదువుకునేటప్పుడు ఎవరితో నో గొడవ పడ్డారు అని తెలిసిందని ఆలీ అడగగా.. అతనెవరో కాదు కోడి రామకృష్ణ అంటూ తెలియజేశారు నరసింహారావు.
ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలియజేశారు నరసింహారావు. ఇక అంతే కాకుండా దాసరి నారాయణరావు దగ్గర తను మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో దాసరి, నరసింహారావు మధ్య ఒక సంఘటన జరిగిందట కదా అని ఆలీ అడగగా.. నేను క్లాప్ బోర్డు ను కింద పెట్టి, కుర్చీలో కూర్చొని ఏదో రాస్తూ ఉండగా.. అదే సమయంలో దాసరి (మా గురువుగారు) అక్కడికి రావడంతో అది తన కాళ్ల పక్కన ఉండటం చూసి లాగి చెంప మీద కొట్టారు. అందుకోసం అందుచేతే నా మీద చేయి చేసుకున్నాడు..అంటూ తెలియజేశాడు నరసింహారావు.