టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు సుకుమార్.  ఆర్య సినిమా ద్వారా దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అగ్ర దర్శకుడు గా ఎదిగారు. ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ పరీక్ష పెట్టే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో కొంత జ్ఞానం ఉంటే గాని సుకుమార్ సినిమాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విజ్ఞానాన్ని సినిమాల ద్వారా చూపించే ఏకైక దర్శకుడు.

ఇటీవల కాలంలో ఆయన రంగస్థలం సినిమా తో భారీ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాకు దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరిద్దరి కలయికలో గతంలో ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సుకుమార్ తన మొదటి సినిమా నుంచి ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న విషయం ఇటీవలే తెలిసింది. హీరోయిన్ ల విషయంలో ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు.

 తన ప్రతి సినిమా హీరోయిన్ పాత్ర పేరు లక్ష్మి అని వచ్చేలా చూసుకుంటున్నాడు. కొన్ని క్లాస్ సినిమాల లో మాత్రం హీరోయిన్ పేరును మార్చాడు కానీ దాదాపుగా హీరోయిన్ పేరు లక్ష్మి అని కలిసేలా చూసుకుంటున్నాడు. తొలి చిత్రంలో గీత అనే పేరును తన హీరోయిన్ పాత్రకు పెట్టుకున్న సుకుమార్ రెండవ చిత్రం జగడం లో మాత్రం సుబ్బలక్ష్మి అనే పేరును పెట్టుకున్నాడు. ఇక తర్వాతి సినిమా 100% లవ్ లో హీరోయిన్ పాత్రకు మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఇక మహేష్ బాబు వన్ సినిమా లో సమీర అని పెట్టగా, నాన్నకు ప్రేమతో సినిమా లో హీరోయిన్ పాత్ర పేరును దివ్యాంకా కృష్ణమూర్తి, రంగస్థలం లో సమంత పేరు రామలక్ష్మి గా పెట్టుకున్నాడు. ఈ విధంగా లక్ష్మీ అనే పేరును తన ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్ర కు వచ్చేలా చూసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: