టాలీవుడ్ చందమామ కాజల్ వయసు పెరుగుతున్న వన్నె తరగని అందంతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్న తన వన్నె తరగని అందంతో ఆమె అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను అలరించబోతోంది. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కూడా సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇష్టపడదు కానీ కాజల్ మాత్రం వరుస సినిమాలను ఒప్పుకొని సినిమాల పట్ల తనకున్న అంకిత భావాన్ని కలిగిస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట్లు ఇచ్చిన కాజల్ అగర్వాల్ తన భర్త వద్దంటే సినిమాలో మానేయడానికి ఏమాత్రం ఆలోచించని చెప్పి అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. దాంతో తమ అభిమాన నటి ఎప్పుడు సినిమాలు మానేస్తుందో అన్న బెంగ కు గురవుతున్నారు  ప్రేక్షకులు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ తర్వాత స్టార్ హీరోలందరూ ఆమెతో నటించాలని కోరుకుంటారు.

కాజల్ పని అయిపోయింది అన్న ప్రతిసారి వరుస సినిమాలతో దూసుకుపోతూ తన స్థానాన్ని పదిలంగా ఉంటుంద ఇప్పుడు కూడా పెళ్లి తర్వాత ఆమె ఇక సినిమాలు చేయదా అని వార్తలు వచ్చిన అవేవి పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రెండు తరాల హీరోలతో ఒకేసారి నటించి వారి తో రొమాన్స్ చేసే హీరోయిన్ కాజల్ రికార్డులకెక్కింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈమె చిరంజీవితో కూడా కలిసి నటిస్తోంది అలాగే అక్కినేని నాగ చైతన్య తో రొమాన్స్ చేసిన కాజల్ నాగార్జునతో కలిసి ఆడిపాడబోతుంది. భవిష్యత్తులో కాజల్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఆమెను సినిమాలు ఇప్పుడప్పుడే మానేయద్దు అని చెబుతున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: