
టాలీవుడ్ మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ గా ఎన్నో రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పెద్ద పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ ను కొనసాగిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. సాధారణ రచయిత గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు అగ్ర దర్శకుడి గా ఎదిగాడు త్రివిక్రమ్. ఆయన మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని చాలా ప్రయత్నించాడు. గతంలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద దర్శకులు ఈ సినిమాను సెట్ చేయాలని భావించగా అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
కొన్ని సినిమాల ద్వారా ఈ ఇద్దరు బ్రదర్స్ గెస్ట్ పాత్రలలో కలిసి కనిపించగా మల్టీ స్టారర్ సినిమా మాత్రం చేయలేకపోయారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా ఈ ఇద్దరు అన్నదమ్ముల తో సినిమా చేయాలని ప్రయత్నించగా ఏదో ఒక కారణం వల్ల అది వాయిదా పడింది. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన తదుపరి సినిమా కు వెళ్ళిపోయాడు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా కొంతమంది దర్శకులు వీరిద్దరూ ఒకే సినిమాలో నటింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కుదరట్లదు.
కొడుకుతో కలిసి ఆచార్య సినిమాలో చిరంజీవి తెర పంచుకుంటున్నాడు. దాదాపు 30 నిమిషాలు తండ్రితో కలిసి రామ్ చరణ్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే బాబీ తెరకెక్కిస్తున్న సినిమాలో చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా నటింపజేయాలని చూస్తున్నాడట. గతంలో ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ప్రాధాన్యత ఉందని వార్తలు రాగా అది చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసింది. కానీ ఆ కథను మళ్ళీ మార్చి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాస్తున్నాడట బాబీ. మరి బాబీ ఈ ప్రాజెక్టులో సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం.