టాలీవుడ్లో పలు సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు పరశురాం.అయితే ఈ డైరెక్టర్ కి భారీ సక్సెస్ వచ్చింది మాత్రం గీతా గోవిందం సినిమాతోనే. ఈ సినిమా తర్వాతే అగ్ర హీరోల దృష్టి పరశురాం పై పడింది.ఇక 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావిస్తున్నారు.తక్కువ బడ్జెట్ తో గీతా గోవిందం సినిమాని తెరకెక్కించి నిర్మాతలకు భారీ లాభాన్ని అందించాడు ఈ దర్శకుడు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు పరశురాం.ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

అంతేకాదు మహేష్ బాబు, కీర్తీ సురేష్ ల కాంబోలో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ప్రేక్షకులల్లో భారీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటె ఈ దర్శకుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.అయితే ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే బన్నీ నుంచి ఈ డైరెక్టర్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట.ఇక ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ బ్యానర్ తో పరశురాం కి మంచి సాన్నిహిత్యం ఉంది.

ఇటీవల గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే గీతా గోవిందం సినిమా తెరకెక్కి భారీ లాభాలను అందుకుంది.అయితే ఆ సమయంలోనే బన్నీతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట పరశురాం.ఇక మరోవైపు కథ నచ్చితే మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ప్రోత్సహించే విషయంలో బన్నీ ఎప్పుడూ ముందుంటాడు.ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య తో పరశురాం ఓ సినిమా చేయాల్సి ఉంది.ఇక చైతూ తో మూవీ పూర్తయిన తర్వాత పరశురాం, బన్నీ కాంబో ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక పరశురాం ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట రిజల్ట్ పైనే తన భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.ఎందుకంటే ఈ సినిమా కనుక హిట్ అయితే బన్నీడైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: