మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా తీస్తున్నారు. మెగాస్టార్ ఇందులో ఒక మాజీ నక్సలైట్ గా కనిపంచనున్నట్లు సమాచారం అందింది. రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయని సమాచారం.అయితే దీని తరువాత అతి త్వరలో తన తరువాత సినిమాని కూడా మొదలు పెట్టనున్నారట మెగాస్టార్ చిరంజీవి. మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ షూటింగులో త్వరలో మెగాస్టార్ జాయిన్ అవ్వనున్నారని సమాచారం అందింది.

మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లుగా మోహన్ రాజా, కొన్ని యాక్షన్ సీన్స్ ని ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో డిజైన్ చేశారని సమాచారం. అయితే ఒరిజినల్ వర్షన్ లూసిఫర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించారాని సమాచారం.కానీ ఇవి అంతగా తెలుగు ప్రేక్షకులను అలరించేలా లేవని, అందువలన ఫైట్ మాస్టర్స్ తో మరొక్కసారి చర్చించి మరింత క్రియేటివ్ గా వాటిని డిజైన్ చేయమని మోహన్ రాజాకి మెగాస్టార్ చిరంజీవి సూచన ఇచ్చారని సమాచారం.
నిజానికి తన సినిమాల్లో ప్రతి విషయమై ఎంతో శ్రద్ధ తీసుకునే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఉన్న అనుభవం తనకు తెలుసనీ, తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని మరింత జాగ్రత్తగా యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తానని మోహన్ అన్నారని సమాచారం. మొత్తంగా అందరిలో మంచి క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ నుండి నేడు సాయంత్రం అఫీషియల్ అప్ డేట్ రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో మహానటి సినిమాతో అందరి ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేష్ ను తీసుకోనున్నట్లు వార్త వినిపిస్తుంది. మరి కీర్తి ఈ  పాత్రకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: