మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడినుంచి వచ్చాను అన్నది మాత్రం మర్చిపోలేదు అందుకే ఆయన ఇప్పుడు మెగాస్టార్ గా ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తాను ముందుండి వారి కష్టాలను తీర్చే వాడు. చిన్న సినిమాలకు సైతం తన చేయూత ఎప్పుడూ ఉంటుంది. పెద్ద స్టార్ హీరో అనే పెద్ద కథానాయకుడు అనే భావన ఆయనలో ఏమాత్రం లేదు. కాబట్టే ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ ఓపెన్ గా ఉంటూ  తమ బాధల గురించి చెబుతూ తమకు సహాయం చేయాలని అడుగుతూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వాళ్లకు ఎలాంటి ఈగొలకూ పోకుండా వారికి తన వంతు సహాయం చేసి ఎంతగానో ఆనందపడేలా చేస్తారు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని సినిమాలకు గాత్ర దానం చేసి వారి పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలిపాడు. మరి మెగాస్టార్ చిరంజీవి గాత్ర దానం చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడ చూద్దాం. మొదట అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకు ఆయన నేరేటర్ వ్యవహరించారు. ఇది గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా కాగా అల్లు అర్జున్ ఆయన మేనల్లుడు కావడం విశేషం. 

ఇక ఆ తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమా కి కూడా గాత్రదానం చేశారు చిరు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు అదే సంవత్సరం రానా హీరోగా నటించిన ఘాజి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గాత్రం దానం చేసి ఆ హీరోల అభిమానులు కూడా ఎంతగానో అలరించారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉన్నతమైన గుణం కలవాడు అనడానికి ఈ నాలుగు సినిమాలే ఉదాహరణ. అంతేకాదు గెస్ట్ పాత్రలో సైతం చాలా సినిమాల్లో తళుక్కున మెరిసి వారి గౌరవాన్ని కూడా కాపాడాడు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఇలా అభిమానులకే కాకుండా ఇండస్ట్రీ పెద్దలకు కూడా దగ్గరగా ఉంటూ వారి అభిమానాన్ని సైతం గెలుచుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: