సాధారణంగా బన్నీ తన సినిమాలలో ఒకసారి తనతో కలిసి పనిచేసిన హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయడు.ప్రతి సినిమాలలో తను చేసిన హీరోయిన్స్ తో కాకుండా వేరే హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు. ఇక పూజా హెగ్డే విషయంలో మాత్రం అలా కాదు. ఈ హాట్ బ్యూటీతో బన్నీ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. మొదటి సారి `దువ్వాడ జగన్నాథం` కోసం ఈ జంట కలిసి రొమాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ  త్రివిక్రమ్ కారణంగా `అల వైకుంఠపురములో` పూజాతో మరోసారి రొమాన్స్ చేశాడు బన్నీ. అయితే మూడోసారి కూడా మన మేడమే కావాలని బన్నీ ఆశిస్తున్నాడట.తాజాగా మళ్లీ వేణు శ్రీరామ్ తో చెయ్యబోయే 'ఐకాన్' సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇక నిర్మాత దిల్ రాజు కూడా పూజా ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఈ హాట్ బ్యూటీకే ఫిక్స్ అయ్యి ఆమెకే తన ఓటు కూడా వేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఇక అంతేకాదు ఆమె డేట్లు గురించి కనుక్కోమని తన టీమ్ ని ఆదేశించినట్లు సమాచారం తెలుస్తుంది.

అదే కనుక నిజమైతే బన్నీ ముచ్చటగా మూడవసారి ఈ హాట్ బ్యూటీతో కలిసి నటించాల్సి ఉంటుంది.టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సమంత, కాజల్ అగర్వాల్,శ్రుతి హాసన్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ లాంటి టాప్ హీరోయిన్ల తోనే ఇప్పటివరకూ బన్నీ రెండుసార్లు సినిమాలు చేయలేదు.రామ్ చరణ్ ఎవడు సినిమాలో కాజల్ తో కాసేపు నటించాడు. అయితే తన పూర్తి సినిమాలో కాజల్ తో రెండోసారి నటించలేదు.అలాంటిది ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పూజా హెగ్డే తో ఏకంగా మూడవసారి జత కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది కనుక నిజం అయితే మాత్రం టాలీవుడ్ లో చర్చనీయాంశమే అవుతుంది.ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: