తెలుగు సినిమా పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా నటుడిగా టెలివిజన్ వ్యాఖ్యాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలు పోషించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనను ఎస్పీబీ అని కూడా పిలుస్తారు. అభిమానులు ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. 1996లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాటలు పాడారు బాలు. 

తెలుగు తమిళ హిందీ లాంటి ప్రాచుర్యమైన భాషలోనే కాకుండా అనేక భాషలలో ఆయన పాటలు పాడి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొన్ని తమిళ చిత్రాలలోని పాత్ర లకు తెలుగులో ఆయన గాత్రదానం చేసి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను పలకరించి వారిని అలరించారు. 1969లో ఆయన మొదటి సారిగా నటుడిగా కనిపించి ఆ తరువాత వరుసగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. మొదట్లో కొన్ని అతిథి పాత్రలలో నటించగా ఆ తరువాత సహాయక పాత్రలు పోషించి ప్రేక్షకుల గుర్తింపు దక్కించుకున్నాడు. వాటిలో ఆయన కు పేరు తీసుకొచ్చిన సినిమా లేంటో ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్ నటించిన ప్రేమ చిత్రం లో కీలకమైన పాత్ర పోషించిన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆ సినిమాలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ప్రేమికుడు పవిత్ర బంధం సినిమాలలో హీరో తండ్రి పాత్రలు చేసి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. నటనలో కూడా తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. ఆరో ప్రాణం రక్షకుడు దీర్ఘసుమంగళీభవ సినిమాలలో నటించి బాలసుబ్రమణ్యం ఎనలేని ఖ్యాతిని గడించారు. ఆయన నటనకు పలు అవార్డులు కూడా వచ్చాయి.  అంతేకాకుండా చివరగా ఆయన నాగార్జున మరియు నాని కలిసి నటించిన దేవదాసు చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: