మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలోని రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా చెప్పింది.  దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లు గా డింపుల్ హాయతి, సంయుక్త మీనన్ లు నటించగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న రవితేజ మరొక హిట్ సంపాదించాలని చెప్పి రమేష్ వర్మ దర్శకత్వంలోనీ ఈ వెరైటీ సబ్జెక్టును ఎంచుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించే విధంగా దర్శకుడు సినిమా తెరకెక్కించాడని చిత్ర బృందం చెబుతుండగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ మెలోడీ పాటను చిత్రం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రాగా సినిమాను దీపావళి తర్వాత విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ దర్శకుడి తో రవితేజ కాంబినేషన్ లో గతంలో వీర అనే సినిమా రాగా ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించాలని చెప్పి ఈ దర్శకుడు ఎంతో కసి తో సినిమా చేస్తున్నాడు.

ఒకానొక దశలో కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఎక్కువ అయ్యాయి. కానీ ఆఖరి షెడ్యూల్ సినిమా మొదలు పెట్టి ఆ రూమర్స్ కు చెక్ పెట్టింది చిత్రబృందం. ఇక ఈ సినిమాతో పాటే రవితేజ మరొక రెండు సినిమాలను చేసే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికే శరత్ మండవ అనే దర్శకుడితో కలిసి రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను మొదలు పెట్టాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మరొక ఎంటర్టైన్మెంట్ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కిలాడి సినిమా విజయం ఈ చిత్రాల పై మంచి ప్రభావం ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే విక్రమార్కుడు సీక్వెల్ సినిమాలో రవితేజ నటించే విధంగా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రవితేజ ఖిలాడి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: