ఇక ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తాడు మోహన్బాబు. ఏకంగా పవర్ఫుల్ యముడి పాత్రలో నటించి ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగానే మోహన్బాబు ఏదైనా పాత్రలో నటించాడు అంటే చాలు పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అలాంటిది ఒక పవర్ ఫుల్ యముడి పాత్రలో నటించి.. పవర్ ఫ్యాక్డ్ డైలాగులు చెప్పడం అంటే.. ఇక మోహన్ బాబు నటన ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యమదొంగ సినిమాలో యముడి పాత్రలో మోహన్ బాబు నవరసాలు పండించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.
అయితే మోహన్బాబు అప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో ఎంతో వైవిధ్యమైన పాత్రలో నటించినప్పటికీ.. యమదొంగ సినిమాలో పవర్ ఫుల్ యముడి పాత్రలో మోహన్ బాబు నటన.. బెంచ్ మార్కు క్రియేట్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఒక పాత్ర కాదు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో నట విశ్వరూపం చూపించడం ఖాయం అని ప్రేక్షకులు కూడా నమ్ముతుంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా విలక్షణమైన నటనకు చిరునామాగా.. ప్రస్తుతం కొనసాగుతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి