కంగన రనౌత్ పేరు చెప్తేనే చాలు బాలీవుడ్ జనాలు సైలెంట్ అయిపోతున్నారు. కరెంట్ విషయంలో జోక్యం చేసుకోవడం ఎందుకని దూరంగా వెళ్లిపోతున్నారు. అయితే సోషల్ మీడియా కామెంట్స్ తట్టుకోలేక.. కంగన దగ్గరకి వెళ్లిన మేకర్స్ ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. ఈమెని ఎందుకు తీసుకున్నారం రా బాబు అని తలలు పట్టుకుంటున్నారట.
అలౌకిక్ దేశాయ్ 'సీత' సినిమాకి కరీనా కపూర్‌ని తీసుకుంటున్నారనే టాక్ రావడం ఆలస్యం విమర్శలు వచ్చాయి. సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా ఖాన్‌ని సీత పాత్రకు ఎలా తీసుకుంటారు అని ట్రోల్ చేశారు నెటిజన్లు. దీంతో కరీనాని పక్కనపెట్టి కంగన రనౌత్‌ని కాంటాక్ట్ చేశారు మేకర్స్.
బాలీవుడ్లో బెస్ట్ పెర్ఫామర్స్‌లో ముందుంటుంది కంగన రనౌత్. రీసెంట్‌గా జయలలిత బయోపిక్ 'తలైవి'లో కూడా కంగన పెర్ఫామెన్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా, ఈ కాంప్లిమెంట్స్‌కి తగ్గ కలెక్షన్లు రాలేదు. పైగా కంగన అనేసరికి ఆడియన్స్‌లో చిన్నపాటి నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. దీంతో ఈమె సినిమా కోసం జనాలు థియేటర్లకి రావడం కూడా తగ్గిపోయింది.
'సీత' సినిమా త్రీడీ టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మరి ఇంత బడ్జెట్‌ని కంగన రనౌత్ సింగిల్ హ్యాండ్‌తో లాక్కొస్తుందా, ఇండస్ట్రీలో, జనాల్లో ఉన్న నెగటివిటీని బీట్ చేసి భారీ వసూళ్లు తీసుకొస్తుందా అని ఆలోచనల్లో పడ్డారట నిర్మాతలు. మరి సెట్స్‌కి వెళ్లకుండానే నిర్మాతలని టెన్షన్ పెడుతోన్న కంగన ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి