టాలీవుడ్ అగ్ర శ్రేణి క‌థ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి కి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న న‌టించిన 153 సినిమాలు విడుద‌ల అయ్యాయి. అలాగే మ‌రో మూడు సినిమాలు ప్ర‌స్తుతం షూటింగ్ లు జ‌రుపు కుంటున్నాయి. ఇన్ని సినిమాల్లో న‌టించ‌డం ద్వారా ఆయ‌న కు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువ మొత్తం లోనే ఉంటారు. అయితే మెగాస్టార్ అభిమాను లకు తాజా గా ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదే మెగా స్టార్ చిరంజీవి కి స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈ విష‌యం తెలుసు కున్న అభిమానులు ఆందోళ‌నకు గురి అయ్యారు. ఈ స‌ర్జ‌రీ విష‌యాన్ని కూడా స్వ‌యం గా మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానులకు తెలిపాడు. కరోనా సెకండ్ వేవ్ స‌మ‌యాల్లో కరోనా వ్యాధి గ్ర‌స్తుల‌కు చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్ ల తో అనేక సేవ‌లు చేశారు. దీంతో ఆ సంస్థ ప్ర‌తినిధుల తో, అలాగే త‌న అభిమానులతో ఆది వారం స‌మావేశం అయ్యారు.ఈ సమావేశంలో కుడి చేతి కి క‌ట్టు ను చూసిన అభిమానులు చిరు ను అడిగారు. దీని పై మెగాస్టార్ స్పందించారు.  త‌న‌కు గ‌త కొద్ది రోజుల నుంచి త‌న కూడి చేతికి కొద్ది పాటు నొప్పి వ‌చ్చింద‌ని తెలిపారు.  ఈ నొప్పి పై వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా కుడి చేతి మ‌ణిక‌ట్టు పై ఒత్తిడి  ప‌డ‌టం వ‌ల్ల అలా అవుతుంద‌ని తెలిపారు. దీన్ని కార్ప‌ల్ ట‌న్నెల్ సిండ్రోమ్ అంటార‌ని వైద్యులు చెప్పార‌ని తెలిపాడు. దీంతో అపోలో వైద్యులు సుమారు 45 నిమిషాల స‌మ‌యం లో త‌న కుడి చేతికి ఆప‌రేష‌న్ చేశార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని అన్నారు. అలాగే మ‌రో 15 రోజుల త‌ర్వాత త‌న చేయి య‌థావిధిగా ప‌ని చేస్తుంద‌ని తెలిపారు.  అలాగే ఈ స‌ర్జ‌రీ వ‌ల్లే త‌న సినిమా షూటింగ్ ల‌కు కొంత గ్యాప్ ఇచ్చాన‌ని తెలిపారు. అయితే చిరంజీవి చేతికి జ‌రిగింది చిన్న పాటి స‌ర్జ‌రీ కావ‌డం తో చిరు అభిమానులు ఊపిరి పీల్చ కున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: