పేపర్ బాయ్ సినిమా తో తెలుగు లో అందరిని ఆకట్టుకున్న దర్శకుడు జయశంకర్.. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అనసూయ ఒక సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చివరి దశకు వచ్చినట్లు సమాచారం. మరో రెండు వారాలలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వెళ్లడిస్తాము అన్నట్లుగా చిత్రం యూనిట్ తెలుపుతోంది.. ఇక తాజాగా లైబ్రరీలో అనసూయ ఒక పుస్తకం చూస్తూ ఉన్నట్టుగా సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు..ఈ ప్రీ లుక్ లో అనసూయ ముఖం మనకు కనిపించడం లేదు..కానీ ఆమె లుక్ అలాగే అవుట్ ఫిట్ చూస్తుంటే ఖచ్చితంగా మరో విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకం అయితే అభిమానులలో రావడం గమనార్హం. ఈ సినిమా చూసిన తరువాత జబర్దస్త్ అనసూయ మరొక సినిమా ఎప్పుడు అంటూ ఆతృతగా అడుగుతున్నారు అభిమానులు. ఇప్పటికీ పుష్పా సినిమాలో దాక్షాయణి గా విలన్ పాత్ర పోషిస్తున్న అనసూయ .. తన పోస్టర్ తో పాటు ఇప్పుడు వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.. ఈ రెండు సినిమాలు కనుక విడుదల అయితే ఆమెను సినీ ఇండస్ట్రీలో మరింత బిజీ ఆర్టిస్ట్ గా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి