హాట్ బ్యూటీ నందిత శ్వేత నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. దానితో ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కక పోయినప్పటికీ, పర్వాలేదు అనే రేంజ్ లో మాత్రం సినిమా అవకాశాలు దక్కాయి. ఇందులో భాగంగా నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో నటించిన నందితా శ్వేతసినిమా మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఇలా ఈ రెండు సినిమాలలో లో హీరోయిన్ గా కాకపోయినా మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందితా శ్వేత 'అక్షర' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించింది, కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం డీలా పడిపోయింది.

ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ సినిమా లతో బిజీగా ఉంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నందితా శ్వేత పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో బెడ్ పై కూర్చొని కాళ్ల వరకూ దుప్పటి కప్పుకొని, బ్లాక్ కలర్ డ్రెస్ లో చేతికి వాచీ పెట్టుకొని, అలా కొంటెగా చూస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత శ్వేతా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: