నటుడు కమల్ హాసన్ ఇటీవలే కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్దిగా దగ్గు మొదలైంది. ఆ తర్వాత వైద్యులు అనుమానంతో ఆయనకు కరోనా టెస్ట్ చేయగా, పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు కమల్ ఐసోలేషన్‌లో, వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తన తండ్రి పరిస్థితిని తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. శృతి హాసన్ తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ గుయించి ట్వీట్ చేస్తూ 'మా నాన్న ఆరోగ్యం కోసం మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆయన కోలుకుంటున్నాడు. త్వరలో మీ అందరితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు !!" అంటూ ట్వీట్ చేసింది. కమల్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న ఆయన అభిమానులకు శృతి ఇచ్చిన అప్డేట్ ఊరటను కలిగిస్తోంది.

కమల్ హాసన్ తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అంటూ స్వయంగా ట్వీట్ చేసి ఈ నెల 22న ఈ సమాచారాన్ని పంచుకున్నారు. కమల్ ట్విట్టర్ లో 'యుఎస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు దగ్గు స్టార్ట్ అయ్యింది. పరీక్ష చేయించుకున్న తర్వాత నాకు కరోనా ఉందని తెలిసింది. నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. మహమ్మారి ఇంకా తగ్గలేదని ఇప్పుడు అర్థమవుతోంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను" అంటూ తనకు కరోనా వచ్చిన విషయాన్నీ వెల్లడించారు కమల్.

1960 నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కమల్ హాసన్ దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది ప్రభుత్వం. పద్మ భూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన మూవీ కెరీర్ లో మొత్తం 171 అవార్డులను అందుకున్నారు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి బిరుదు ఇచ్చి సత్కరించింది. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని కమల్ 18 సార్లు సొంతం చేసుకోవడం ఒక రికార్డు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: