పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాదేశ్యాం'. ఈ సినిమాలో డార్లింగ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్న విషయం విదితమే. ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ సినిమా మేకర్స్. దాంతో అంతా ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని వెండి తెరపై చూద్దామా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇపుడు తాజా సమాచారం ప్రకారం...ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగలబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. జనవరిలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందన్న శాస్త్రజ్ఞుల అంచనాలు నిజమేనేమో అనిపిస్తుంది. నిన్న, మొన్నటి వరకు ఈ మహమ్మారి ప్రశాంతంగా వున్న సమయంలో మళ్ళీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు అందరినీ సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. కరోనా కనుక మళ్ళీ తిరగబడితే మళ్ళీ థియేటర్లకు సినిమా కష్టాలు తప్పవు.  ఈ క్రమంలో జనవరిలో రిలీజ్ చేయాల్సిన పలు సినిమాలు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా ప్రభాస్ చిత్రం 'రాదేశ్యాం' పేరు ప్రధానంగా వినబడుతోంది.

రిలీజ్ చేసేసి తరవాత తంటాలు పడేకన్నా ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి ఒకేసారి సమ్మర్ వెకేషన్ కి ప్లాన్ చేస్తే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా లేట్ అయిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలే నిజమైతే వారి స్పందన ఎలా ఉంటుందో మరి. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: