కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా భారతీయుడు, ఈ సినిమా లో మనిషా కొయిరాల, ఊర్మిళ మటోండ్కర్, సుకన్య ముఖ్య పాత్రలు పోషించారు, 1996 లో విడుదలైన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇలా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు శంకర్ ఇండియన్  టు సినిమా ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమా లో కూడా కమల్ హాసన్ హీరోగా నటించగా, కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఈ షూటింగ్ నిలిచిపోయింది, ఆ తర్వాత అనేక పరిణామాల వల్ల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం శంకర్ వచ్చింది. అయితే ప్రస్తుతం దర్శకుడు శంకర్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమాతో పాటు భారతీయుడు టు సినిమా ను కూడా ఒకే సారి తెరకెక్కించే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇండియన్ టు సినిమా ప్రారంభించడానికి మరొక సమస్య కూడా ఉంది, ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్  ప్రెగ్నెంట్ అని ఆమె ఇండియన్ టు సినిమా నుండి తప్పుకుంది అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ సందర్భం లో ఈ సినిమాలో కాజల్ స్థానంలో త్రిష ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది అంటూ వార్తలు వచ్చాయి, అయితే తాజా గా ఇండియన్ టు సినిమాలో కాజల్ అగర్వాల్ స్థానం లో మిల్కీ బ్యూటీ తమన్నా ను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు మరో వార్త వైరల్ అవుతుంది, ఈ వార్తపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: