సమంత పెళ్లి తరువాత నటించిన సినిమాలతో చాలా మందికి అభిమాన నటిగా మారిపోయింది. అంతేకాదు.. అన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన నటనతో సత్తా చాటింది. పెళ్లి తరువాత భర్త నాగ చైతన్యతో మజిలీ సినిమాలో నటించిన సమంత ఆ తర్వాత ఓ బేబీ అంటూ వృద్దురాలిగా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో టెర్రస్ పై చెట్ల పెంపకం.. భర్తకి ఇష్టమైన వంటకాలు నేర్చుకోవడం వంటి వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
అంతేకాదు.. సమంత బిగ్ బాస్ షోలో ఒక ఎపిసోడ్‌ని హోస్ట్ చేయడం.. ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత వరుస సినిమాలతో బిజీగా రాణిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు విహారయాత్రల్లో ఉండే సమంత సద్గురును కలవడం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఆమెకి ఆధ్యాత్మిక చింతనతో పాటు దైవికం గురించి సద్గురు చెప్పిన కొన్ని మాటలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.