అప్పుడే పుట్టిన బిడ్డ చర్మం ఎంత మృదువుగా వుంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వారికి చర్మ ఆరోగ్యానికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే ఎటువంటి హాని కలుగదు. అయితే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలొ ఇప్పుడు చూద్దాం..


అయితే అప్పుడే పుట్టిన బిడ్డ చర్మం పై ఒక మైనపు పోర ఉంటుంది. వెర్నిక్స్ అని పిలువబడే తెల్లటి మైనపు పదార్థంతో కప్పబడి ఉంటుంది. పుట్టిన తర్వాత మొదటి కొన్ని వారాలలో, ఈ వెర్నిక్స్  పై వస్తుంది..కొద్ది రోజుల వరకూ ఎటువంటి క్రీమ్ పూయవలసిన అవసరం లేదు. అదే చర్మాన్ని తెమగా మారుస్తుంది.ముఖం, డైపర్ వాడే ప్రాంతంలో కాస్త జాగ్రత్త వహించాలి.లేకుంటే ర్యాషెస్ వస్తాయి.


పిల్లలను ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచిది. వారికి ఎటువంటి రోగాలు రావు ముఖ్యంగా స్నానం చెయించాలి..ఉదయం సాయంత్రం చేయించడం వల్ల  బిడ్డకి ఎటువంటి వైరస్ భయం ఉండదు..అలాగని ఒకటే సారి ఎక్కువగా రుద్ద కూడదు..ఇది ముఖ్యంగా గమనించాలి.. అలా ఎక్కువగా చేయడం వల్ల చర్మం పై సహజ నూనెలు పోతాయి. అందుకే గాఢత తక్కువగా ఉన్న సబ్బులను ఎక్కువగా వాడాలి..స్నానానికి గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఉపయొగించాలి..గది ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, తద్వారా శిశువు ఏ విధంగానూ చల్లగా ఉండదు.. ఇది ఆలొచించాలి..


పిల్లలకు మాసాజ్ చేయాలి..ఇలా చేయడం వల్ల కండరాలు బాగా సాగుతోంది. అప్పుడు ఎటువంటి లోపాలు ఉండవు..స్కిన్ మసాజ్ కోసం కొబ్బరి నూనె లేదా బేబీ ఆయిల్ ఉపయోగించవచ్చు.. మార్కెట్ లో దొరుకుతున్నవి వాడటం సేఫ్ కాదు.. మెత్తని చర్మం కాబట్టి మెత్తని కాటన్ టవల్ తో వాడటం మేలు..డైపర్ లు వాడే వాళ్ళు సైజ్ చూసుకొని వాడాలి. చిన్నవి అయితే దద్దుర్లు, దురదలు, అలెర్జిలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..పైన తెలిపిన వాటిని జాగ్రత్రగా పాటించాలి.. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: