అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేదు. ఏదైనా ఇష్టమైన రంగంలో రానించాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. మగాళ్లను దాటి ఎక్కడా నిలబడే సందర్భాలు లేవు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో.. అమ్మాయి పాత్ర కోసం వెళితే పక్కలోకి రావాలని అంటున్నారు. ఇది నిజంగా బాధాకరమైన సంఘటన.. ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఇదే తంతు.. ఇప్పటికే ఈ విషయం పై చాలా చర్చలు జరిగాయి.ముఖ్యంగా వెండి తెర నటులు ఎన్నో పేస్ చేశారు. భయం తో బయట పడలేక పోతున్నారు కొందరు.మరి కొందరు మాత్రం బయట పడినా కూడా సినిమా అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్క్కొవాల్సి ఉంటుంది..


బుల్లి తెరపై కూడా ఇదే తంతు..  కొన్ని షో లలో కనిపించాలని వెలితే లైంగిక వెధింపులు తప్పడం లేదు. అంతెందుకు బుల్లి తెరపై నవ్వుల షో గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని కొందరు నటులు చెబుతున్నారు. ముఖ్యంగా లేడీ గెటప్ వేస్తున్న వాళ్ళను చాలా మంది ఇబ్బందులు పెట్టారని చెప్పి బాధపడుతున్నవారు చాలా మంది వున్నారు.


ఇది ఇలా ఉండగా.. లేడీ గెటప్ వేస్తున్న వారికి బయట కష్టాలు తప్పడం లేదు.. వాళ్ళు మగవాళ్ళు అయినా కూడా చాలా మంది హిజ్రా లను పిలుస్తూ బాధపెడుతున్నారు.. హరి, శాంతి స్వరూప్ లు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి..అవకాశాల కోసం వచ్చిన మొదట్లో కొందరు టీమ్ లీడర్స్ రూమ్ కు రమ్మారని చెప్పాడు.జబర్దస్త్ నటులకు ఇలాంటి వేధింపులు ఇదే తొలిసారి కాదు. గతంలో అమ్మాయిగా మారిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్‌ను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచి లైంగిక దాడి చేసినట్లు తెలిపారు. ఇలా చాలా మంది లైంగిక వేధింపులకు గురియ్యారు. కేవలం కుటుంబం కోసం ఇలా చెస్తున్నామని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: