మెగా హీరో సాయిధరమ్ తేజ్.. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ ను నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలను చేసినప్పటికి ఆయనకి అవన్నీ డిజాస్టర్ నే మిగిల్చాయి. అయితే అలా ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత.. తాజాగా కమెడియన్ సప్తగిరి తో ఒక మూవీని తీయడానికి సిద్ధమైపోయారు. ఇక ఈ కమెడియన్ కూడా సప్తగిరి ఎక్స్ ప్రెస్.. సినిమాతో హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. ప్రస్తుతం ఏ.ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్లో ఒక మూవీ లో నటించబోతున్నాడు ఈ కమెడియన్.

ఇక ఈ సినిమాని రిగ్వేద క్రియేషన్స్ బ్యానర్ పై.. నిర్మించబోతున్నారు.. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా బాగా వేగంగా జరుగుతున్నాయట. ఇక ఈ సినిమాని వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్ సభ్యులు.. అయితే ఇప్పుడు ఈ కమెడియన్ తో ఈ డైరెక్టర్ సినిమా చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటా అని అందరూ అనుకుంటున్నారు. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే ఈ కమెడియన్ తో సినిమాలు చేసిన దర్శక ,నిర్మాతలు నష్టాలను చవి చూడలేదట.. అందుచేత ఎంతో మంది నిర్మాతలు కూడా ఈయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

తనతో సినిమా చేస్తే నష్టాలు కలగక పోవడంతో పాటు.. వారు పెట్టిన డబ్బులు మొత్తం తిరిగి వస్తుండడం, లాభాలు కూడా వస్తూ ఉండడంతోనే సప్తగిరి తో సినిమాలు చేయడానికి దర్శకులు సైతం ఆసక్తి చూపుతున్నారట. ఇటీవల కాలంలో గూడుపుఠాని సినిమా విడుదల అయినప్పటికీ నిర్మాతలకు లాభాన్ని తెచ్చి పెట్టిందట. అందుకే ఈ కమెడియన్ వెంటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: