ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు సుకుమార్. తన సినిమాలతో టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే సుకుమార్ శిష్యుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు బుచ్చిబాబు. ఉప్పెన అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఎలాంటి స్టార్ హీరో లేకపోయినప్పటికీ ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక బుజ్జి బాబు టేకింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.  సినిమా హిట్ కావటంతో హీరో హీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. అయితే మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు రెండవ సినిమా కోసం స్టార్ హీరో ని లైన్ లో పెట్టే పనిలో పడ్డారట. చిన్న హీరో కాకుండా ఏకంగా టాప్ హీరో తో సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు బుచ్చిబాబు. ఈ క్రమంలోనే ఇటీవలే దర్శకుడు బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కు ఒక అదిరిపోయే కథ చెప్పి ఆయననూ ఇంప్రెస్ చేసేసాడు అంటూ ఒక టాక్ కూడా వినిపించింది. కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తుండగా... ఇక మరో దర్శకుడు అట్లీ తో కూడా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట.


 దీంతో ఇక వీరిద్దరి దర్శకులతో సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు తో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అట్లీ తో చేయబోయే సినిమా కాస్త వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ కి కూడా కథ వినిపించగా ఎవరు ముందుగా సిద్ధంగా ఉంటే వారితో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు అట్లీ. దీంతో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీ తో నటించేందుకు సిద్ధం కావడంతో ఇక ఎన్టీఆర్ సినిమాని ఆ తర్వాత పట్టాలెక్కించాలి అని అట్లి అనుకుంటున్నాడట. దీంతో ఇక కొరటాల శివ సినిమా తర్వాత బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండే స్టోరీని ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడట లెక్కల మాస్టర్ శిష్యుడు బుచ్చిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: