ఈ సినిమా నిర్మాత భారతికి ఎక్కువ మొత్తంలో లాభాలు తీసుకొని రాలేదు. ఈ సినిమా ద్వారా రాజమౌళి రగ్బీ గేమ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అందరికి పరిచయం చేశారు. ఈ సినిమా నిర్మాత తాజాగా ఒక సందర్భంలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారట.. స్టూడెంట్ నంబర్ 1 మరియు సింహాద్రి సినిమాల తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సై సినిమా కోసం మొదట స్టార్ హీరోను తీసుకోవాలని అనుకున్నామని తెలిపారట..
ఆ సినిమాలో నితిన్ ను తీసుకోకూడదని తాను భావించానని ఆమె అన్నారట.. అయితే నితిన్ మరియు నితిన్ తండ్రి హీరో విషయంలో మార్పు చేయవద్దని కోరారని ఆమె చెప్పుకొచ్చారట.. సై సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తను నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమా రాలేదని భారతి కామెంట్లు చేశారట.. సై సినిమా తర్వాత నితిన్ నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే.
వరుస ఫ్లాపుల తర్వాత ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో నితిన్ ఖాతాలో విజయాలు చేరాయి. ప్రస్తుతం రాజమౌళితో సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారట.సినిమాసినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్ అంచనాలకు అందని స్థాయిలో పెరిగి పోతుంది.రాజమౌళి ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాలను కూడా తీసుకుంటున్నారట. రాజమౌళికి క్రేజ్ ఉండటంతో స్టార్ హీరోలు సైతం ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి