బుల్లితెరపై ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్డస్త్ షోలో స్టార్ స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శీను ఒకరు. ఆయన సుడీగాలి సుధీర్ టీంలో తన దైన గెటప్‌లతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతేకాదు.. గెటప్ శ్రీను తనదైన పంచెస్, కామెడీ టైమింగ్ తో పాటు కొత్త కొత్త గెటప్స్‌తో జబర్దస్త్ వేదికగా నవ్వుల రారాజుగా రాణిస్తున్నారు. ఆయన బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తనదైన శైలిలో రాణిస్తున్నారు.

అయితే గెటప్ శీను జబర్దస్త్ లో షో ద్వారా క్లిక్ అయ్యాక చాలా మంది అభిమానుల మనస్సును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. ఆయన విభిన్న ప్రొగ్రామ్స్‌, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్‌లో కూడా తనదైన కామెడీ చేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక శ్రీనుకి తోడుగా సుధీర్, రాంప్రసాద్ కలిస్తే ఆ కామెడి ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇక తమ జీవితంలో వెలుగు తీసుకొచ్చిన షో జబర్దస్త్ అని ఈ త్రి మంకీస్ పలుమార్లు వెల్లడించారు. కాగా.. తన కామెడీ టైమింగ్‌తో శీను ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్, సైడ్ రోల్స్ చేశాడు. బుల్లితెరతో పాటు అటు వెండితెరమీద కూడా శీను చాలా బిజీగా రాణిస్తున్నారు. ఇక ఉన్నట్టుండి శీను ఒక్కసారిగా సాయం కోరుతూ అందరినీ షాక్ గురి చేసిన సంఘటన వైరల్ గా మారింది.

నిజానికి గెటప్ శ్రీను సహాయం అడిగింది తన కోసం కాదట. అయితే రాజమండ్రిలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆనంద్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఖర్చులకు రూ.4లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. ఇక బాధితుడి కుటుంబం వద్ద అంత డబ్బులు లేకపోవడంతో వారు శీను దృష్టికి తీసుకురాగా.. శీను తను కొంత సాయం చేయడంతో పాటు అభిమానులతో పాటు ఇతరులను కూడా సాయం చేసి ఆనంద్ లైఫ్ సేవ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: