కొంతమంది హీరోలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఓ పట్టాన వారికి పాన్ ఇండియా ఇమేజ్ రాదు. గత నాలుగు సంవత్సరాల నుంచి అందరు హీరోలు కూడా ఈ విధమైన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తెలుగులో అందరికీ బాగా ఇష్టమైన హీరో మంచి స్థాయి క్రేజ్ ఉన్న హీరో నాని కి మాత్రం ఆ స్థాయి ఎందుకు రావడం లేదో తెలియదు కానీ ఆయన అభిమానులు అయితే తీవ్రంగా నిరాశ పడుతున్నారు.
ఆయన కేవలం తెలుగు ప్రేక్షకులను మెప్పించ గల సినిమాలను మాత్రమే ఎంచుకోవడం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోకపోవడం దీనికి ముఖ్య కారణం అని అంటున్నారు. కారణం ఏదైనా కూడా నాని పాన్ ఇండియా సినిమాలు చేస్తే చూడాలని అందరు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమాలు మాత్రమే ఉన్న ఈ నేపథ్యంలో నాని ఎప్పుడూ పాన్ ఇండియా సినిమా చేస్తాడో చూడాలి.
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని అంటే సుందరానికి అనే కామెడీ భరితమైన చిత్రాన్ని చేయబోతున్నాడు. మలయాళ కథానాయిక నజ్రియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా అలరించింది. సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇకపోతే దసరా అనే మరొక సరి కొత్త సినిమా కూడా నాని చేయబోతున్నాడు. ఇది భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాగా త్వరలోనే రాబోతుంది. ఇందులో యాక్షన్ ప్రధానంగా ఉండబోతుంది. అలాగే ఈ చిత్రంలోని పాత్ర కూడా ఎంతో వెరైటీగా ఉండబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాని ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచన లో ఉన్నాడని అంటున్నారు. దానికి సంభందించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి