ఇక ఈ సినిమాలు నాగ శౌర్య బ్రాహ్మణ కుర్రాడిగా మనకు కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నేచరల్ స్టార్ నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాలలో ఈ ఇద్దరు హీరోలు కూడా బ్రాహ్మణ కుర్రాళ్ళు గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉంటున్నట్లు సమాచారం.
మరి బ్రాహ్మణ హీరోలగా ఎవరికి కలిసి వస్తుందో తెలియాలి అంటే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే వరకూ ఎదురుచూడక తప్పదు. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి విజయాలను అందుకుంటారో కూడా మనకు తెలియాల్సి ఉంది.. ఇప్పటికీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి