సినిమా ఇండస్ట్రీ చాలా గమ్మత్తు అయినది. ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కొందరు హీరోలు ఎంత పలుకుబడి ఉన్నా కెరీర్ లో ఇంకా నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. దీనికి కారణం టాలెంట్ ఉన్న నటీనటులు వస్తూ ఉండడమే. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు నటన నచ్చితే చాలు బ్రహ్మరథం పడుతున్నారు. అలా వచ్చిన ఒక హీరో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో గా నిలిచాడు. అతను ఎవరో కాదు కన్నడ లో ఒక సీరియల్ లో నటుడిగా కెరీర్ ప్రారంభించి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కన్నడ స్టార్ యశ్. మొదట్లో కొన్ని సినిమాలు చేసినా అవేమీ తనకు మంచి పేరును తెచ్చిపెట్టలేకపోయాయి.

ఆ తర్వాత 2018 లో ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు యశ్ తో కలిసి కెజీఎఫ్ అనే ఒక సినిమాను తీశాడు. ఈ సినిమా విడుదల అయ్యే  అంత వరకు ఎవ్వరికీ తెలియదు. అయితే సినిమా రిలీజ్ అయిన నాటి నుండి మెల్ల మెల్లగా ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన కెజీఎఫ్ సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది. దీనితో ఓవర్ నైట్ లో యశ్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో ప్రతి ఒక్క అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న కెజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా యశ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్, టీజర్, తూఫాన్ సాంగ్ వీడియో ఇవన్నీ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచాయి. ఈ సినిమా ఏప్రిల్ రెండవ వారంలో విడుదల కావడానికి సిద్దంగా ఉంది.  కాగా ఈ సినిమా నుండి రేపు సాయంత్రం 6. 40 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. మాస్ యాక్షన్ మూవీ గా వస్తున్న కెజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. అంతకన్నా ముందు రేపు విడుదల అయ్యే ట్రెయిలర్ ఎలా ఉంటుంది? మంచి కట్టింగ్ లతో ప్రశాంత్ నీల్ విడుదల చేసే ట్రెయిలర్ అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: