పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్, రేణు దేశాయ్ కథానాయకులుగా నటించిన చిత్రం బద్రి. ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా 2000 వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ రోజుకి ఈ సినిమా విడుదలై 22 ఏళ్ల పూర్తి చేసుకుంది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటికి 22 సంవత్సరాలు కావస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కి బద్రి సినిమా మరింత హైప్ ను తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.

ఈ సినిమాలోని పాటలు..  రమణ గోగుల అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కానీ దీంతో పూరి జగన్నాథ్ చాలా బాధ పడ్డారట. తన మొదటి సినిమాకి ఇలాంటి టాక్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేశారు. ఈ విషయాన్ని పూరికి స్నేహితుడైన సింగర్ మరియు నటుడు రఘు కుంచే తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ బద్రి సినిమా మొదటిరోజు నెగటివ్ టాక్ రావడంతో ఆ టైంలో ఫిలింనగర్లో.. బద్రి చిత్రానికి సంబంధించి ఒక ఆఫీస్ కూడా ఉండేది.

ఆ ఆఫీస్ కి తను అక్కడికి వెళ్లగానే పూరి జగన్నాథ్ బాధపడుతూ కింద కూర్చున్నాడు. ఎన్నో కలలు కంటూ ఈ సినిమాను తీశాను ఇలా అయిపోయిందేంటి అంటూ బాధపడుతూ తనతో చెప్పినట్లుగా తెలియజేశారు. కానీ మరుసటి రోజు ఈ చిత్రం పాజిటివ్ గా మారింది. ఇక మూడవ రోజు నుంచి మంచి పిక్ అప్ అయితే ఈ సినిమా ఏకంగా 200 రోజులు ఆడిందని చెప్పుకొచ్చాడు రఘు కుంచే. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని చిత్రాలలో విలన్స్ రోల్స్ లో కూడా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: