ఈనెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును అత్యంత ఘనంగా నిర్వహించాలని తారక్ అభిమానులు భారీ ప్రణాళికలతో ఉన్నారు. ఆరోజు సోషల్ మీడియా అదిరిపోయే విధంగా తారక్ అభిమానులు హడావిడి చేయబోతున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన తారక్ తన పుట్టినరోజునాడు తన సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చి తన అభిమానులకు జోష్ ను కలిగించాలని ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.


దీనిలో భాగంగా కొరటాల శివ జూనియర్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ టైటిల్ ప్రకటన ఆరోజు ఉండబోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ నటించబోయే మూవీకి సంబంధించిన ప్రకటన కూడ ఉంటుంది అంటున్నారు. వీటికితోడు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తో తారక్ చేయబోయే సినిమాకు సంబంధించిన అ అధికారక సమాచారం కూడ ఆరోజే వస్తుంది అంటున్నారు.


ఇవన్నీ ఒక ఎత్తయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో జూనియర్ అభిమానులకు కల్గిన అసంతృప్తిని పోగొట్టడానికి మరో మాష్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఓటీటీ లో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని జూనియర్ పుట్టినరోజు నుండి స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త జూనియర్ అభిమానులకు జోష్ ను కలిగిస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో తారక్ కు జాతీయ స్థాయిలో విపరీతమైన ఇమేజ్ వస్తుందని అతడి అభిమానులు భావించారు.


ఈమూవీలోని కొమరం భీమ్ పాత్ర కోసం జూనియర్ కూడ ఎంతో కష్టపదినప్పటికీ విమర్శల ప్రశంసలు మాత్రం రామ్ చరణ్ అల్లూరి పాత్రకు లభించాయి. దీనితో తారక్ అభిమానులు తమ హీరోకి రాజమౌళి అన్యాయం చేసాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ ఓటీటీ స్ట్రీమింగ్ జూనియర్ పుట్టినరోజున ప్రారంభం అవుతూ ఉండటంతో అతడి అభిమానుల అసహనం చాలావరకు తగ్గే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా కొరటాల జూనియర్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది అని వస్తున్న వార్తలు విని అతడి అభిమానులు ఖంగారు పడుతున్నట్లు తెలుస్తోంది..
మరింత సమాచారం తెలుసుకోండి: